భర్తపై హత్యాయత్నం.. భార్య, ప్రియుడు అరెస్ట్
AP: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తపై హత్యాయత్నం చేసి ప్రియుడితో సహా అరెస్ట్ అయిందో మహిళ. చిత్తూరు కోతిగుట్టకు చెందిన వెంకటేశులు ఆర్మీలో పనిచేస్తుండగా.. అతని భార్య శిల్పకు వెంకటేశ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఇది తెలిసిన భర్తను అడ్డు తప్పించాలని.. చంపేందుకు వేడినూనె పోసి పరారైంది. మేలో ఈ ఘటన జరగ్గా.. నాటి నుంచి పరారీలో ఉన్న నిందితులు తాజాగా పట్టుబడ్డారు.