భారీ వర్షాలు.. వేలాది ఎకరాల్లో పంట నష్టం

భారీ వర్షాలు.. వేలాది ఎకరాల్లో పంట నష్టం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 17,757 ఎకరాల్లో వరిచేలు ముంపుకు గురయ్యాయి. అత్యధికంగా పెంటపాడు(M)లో 7,301, ఇరగవరం 1,782, గణపవరం 1,672, అత్తిలి 1,625 ఎకరాల్లో నీట మునిగాయి. ఉండి, పెనుగొండ, తణుకు, ఆకివీడు(M)లో 500 ఎకరాలకుపైగా నష్టం వాటిల్లింది. మరో రెండు రోజులు పాటు ఇలాగే వర్షాలు కురిస్తే భారీగా నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.