నరసాపురంలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం
W.G: నరసాపురం పాతబజార్ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద, గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.