VIDEO: మాజీ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలపై కేసులు
NGKL: మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘించిన పలువురిపై కేసులు నమోదయ్యాయి. విద్యుత్ స్తంభాలపై టపాసులు పేల్చి ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకు ప్రవీణ్, భాస్కర్ గౌడ్ల పై మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. రోడ్లను అడ్డగించి ప్రజా రవాణాకు భంగం కలిగించిన మరో ఆరుగురిపై ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.