ఎలుగూరు రంగంపేటలో బీజేపీ అభ్యర్థి గెలుపు
WGL: సంగెం మండలంలోని ఎలుగూరు రంగంపేట గ్రామంలో బీజేపీ ఖాతా తెరిచింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బెజ్జంకి శేషాద్రి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 140 ఓట్ల మెజారిటీతో ఆదివారం ఘన విజయం సాధించారు. ఈ విజయంతో గ్రామంలో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. పార్టీ జెండాలతో సంబరాలు నిర్వహిస్తూ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.