'రైతులకు ఆరోగ్య దీపిక కార్డు తప్పనిసరి'

WGL: జిల్లాలో రైతులకు పంటల ఆరోగ్య దీపిక కార్డు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ సత్య శారద నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ కార్డులో రైతుల వివరాలు, సాగు చేసే పంటలు, విస్తీర్ణం నమోదవుతాయి. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు బుధవారం కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్డుతో యూరియా తీసుకున్న వివరాలను నమోదు చేస్తున్నారు.