INSPIRATION: పట్టాభి సీతారామయ్య
భోగరాజు పట్టాభిసీతారామయ్య పశ్చిమగోదావరి జిల్లాలో 1880లో జన్మించారు. గాంధీజీ పిలుపు మేరకు 1916లో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. సామాన్య ప్రజలకు బ్యాంకులు అందుబాటులో లేని రోజుల్లో, అప్పుల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్న రోజుల్లో ఆయన 1923లో ఆంధ్ర బ్యాంకును స్థాపించారు. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం కృషి చేశారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పట్టాభి పోరాడారు.