VIDEO: పిచ్చుకలంక విషాదం.. మృతదేహాలు లభ్యం
KKD: పిచ్చుకలంక వద్ద గోదావరిలో శనివారం గల్లంతైన షేక్ సుల్తాన్ అహ్మద్, షేక్ బాబు దిన్ మృతదేహాలను అధికారులు ఆదివారం బయటకు తీశారు. మృతుల కుటుంబాల రోదనలు అందరినీ కలచివేసింది. స్విమ్మింగ్‌కు వెళ్లిన యువకులు మృత్యువాత పడటంతో స్తానికంగా తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నదీ తీరాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.