లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి: ఎస్పీ

SKLM: జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్ స్థాయిలో రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్న కేసులను ముందుస్తుగా గుర్తించాలన్నారు.