జిల్లాలో శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమం

జిల్లాలో శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమం

సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు జిల్లాలోని మండలాల్లో శ్రీపాదరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు.