సర్పంచ్‌గా అనూష ఏకగ్రీవం
JN: జాఫర్‌గఢ్ మండలంలోని దుర్గ్యా నాయక్‌తండాలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి బానోత్ అనూష యాకూబ్‌నాయక్ ఏకగ్రీవం అయ్యారు. గ్రామం నుంచి సర్పంచ్ స్థానానికి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా ముగ్గురు ఉపసంహరించుకున్నారు. దీంతో అనూష యాకూబ్‌నాయక్ ను సర్పంచ్‌గా ప్రకటిస్తూ అధికారులు ధ్రువపత్రాలు అందజేశారు.