పొగ మంచులో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ
ASF: పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరం అని, యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉందని, పరిమిత వేగంతో వెళ్లాలని ASF ఎస్పీ నితిక పంత్ అన్నారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరి, పొగమంచు దట్టంగా కమ్ముకొని రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితులు ఏర్పడుతాయన్నారు. హెడ్ లైట్లు, ఫాగ్ లైట్లు వేసుకొని నెమ్మదిగా వాహనాలు నడపాలన్నారు.