కామాంధుడిని చితకబాదిన పారిశుద్ధ్య కార్మికురాలు
చెన్నైలోని అడయార్ బ్రిడ్జి వద్ద విధి నిర్వహణలో ఉన్న 50 ఏళ్ల శానిటరీ వర్కర్ ముందు ఓ బైకర్ అసభ్యంగా ప్రవర్తించాడు. యువకుడు ప్యాంట్ జిప్ విప్పి అసభ్యత ప్రదర్శించగా, ఆ వర్కర్ షాక్ నుంచి తేరుకుని తన చీపురుతో అతడిని బలంగా కొట్టింది. దెబ్బలకు భయపడిన ఆ కామాంధుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ మహిళ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.