VIDEO: నేత్రపర్వంగా "గిరి ప్రదక్షిణం"

VIDEO: నేత్రపర్వంగా "గిరి ప్రదక్షిణం"

NZB: జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ గ్రామంలోని స్వయంభూ శిలా తీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం వద్ద శనివారం "గిరి ప్రదక్షిణం" నిర్వహించారు. చుట్టుపక్కల జిల్లాల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారు మ్రోగింది.