పటేల్ స్ఫూర్తిని నిలబెడతాం: మోదీ
సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ 'X' వేదికగా నివాళులర్పించారు. 'పటేల్ భారత సమైక్యతకు చోదక శక్తిగా నిలిచి.. దేశ నిర్మాణాత్మక సమయంలో దాని గమ్యాన్ని రూపొందించారు' అని మోదీ పేర్కొన్నారు. జాతీయ సమగ్రత, సుపరిపాలన, ప్రజా సేవ పట్ల పటేల్ నిబద్ధత తరతరాలకు స్ఫూర్తినిస్తోందన్నారు. దృఢమైన భారత్ అనే పటేల్ దార్శనికతను నిలబెట్టాలనే తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.