రూ.29కే ఈటీవీ విన్ వినోదాలు

'ఈటీవీ' 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా OTT సంస్థ ఈటీవీ విన్ బంపరాఫర్ ప్రకటించింది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధరను మరింత తగ్గించింది. ఇప్పటివరకు రూ.99 ఉన్న ఈ ధరను రూ.29 చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 29వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఇక ఏడాది సబ్‌స్క్రిప్షన్ రూ.499(ప్రీమియం ప్లాన్), రూ.699(ప్రీమియం ప్లస్ ప్లాన్)గా ఉంది.