మర్రిపాడు నూతన డీటీగా అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు: మర్రిపాడు నూతన డిప్యూటీ తహసిల్దార్‌గా అనిల్ కుమార్ యాదవ్ సోమవారం మర్రిపాడులోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ బదిలీపై మర్రిపాడుకు వచ్చారు. మండలంలో ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు.