'తేజస్వి సూర్య అవివేకానికి నిదర్శనం'

'తేజస్వి సూర్య  అవివేకానికి నిదర్శనం'

TG: రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంపీ వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనమని, చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తీరును భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు .