చిన్న వర్షానికే చెరువుగా ప్రగతి నగర్.. ప్రజల ఆవేదన
GNTR: సుద్దపల్లి డొంకలోని ప్రగతి నగర్‌లో కొద్దిపాటి వర్షానికే రహదారులు నీటితో నిండిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. సైడ్ కాలువలు లేకపోవడంతో నీరు నిల్వ ఉండి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గతంలో డయేరియా, విష జ్వరాలు వ్యాపించాయని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.