గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ లీకేజీ

MBNR: దేవరకద్ర మండలం పెద్ద రాజమూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వాటర్ ట్యాంకర్ గత కొద్ది రోజులుగా లీకేజీ అవుతోంది. దీనివల్ల గ్రామ ప్రజలు నీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ట్యాంకర్‌కు మరమ్మతులు చేసి, నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు మంగళవారం కోరారు.