సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు పట్ల హర్షం

NLG: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు పట్ల రావులపెంట గ్రామ గౌడ్ సంక్షేమ సంఘం సభ్యులు శీలం వినయ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేస్తున్న సందర్భంగా గౌడ్ సంక్షేమం తరుపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.