VIDEO: ద్విచక్ర వాహనం ఢీ.. వ్యక్తి దుర్మరణం
SKLM: సింగుపురం కూడలి వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. గార M వమరవల్లి గ్రామానికి చెందిన ధనుంజయ రెడ్డి, సింగుపురం నుంచి నరసన్నపేట వైపు బైక్ పై వెళ్తుండగా మట్టా వెంకటరావు (50) ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో వెంకటరావు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నారు.