కార్పొరేషన్ ఛైర్మన్‌గా వెంకటరమణ బాధ్యతలు స్వీకరణ

సత్యసాయి: రాష్ట్ర సగర(ఉప్పర) సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా రంగేపల్లి వెంకటరమణ గురువారం విజయవాడలో బీసీ భవన్ లో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ శ్రీనాథ్, శ్రీ రంగరాజుపల్లి రాము, తురకలపట్నం నాగరాజు, పైడేటి రామచంద్ర, రొద్దం మాజీ ఎంపీపీ నరసింహులు, రంగేపల్లి జనసేన నాయకులు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.