VIDEO: జిల్లా రద్దుపై ఎమ్మెల్యే ఆందోళన
జనగామ జిల్లాను రద్దు చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని చెప్పినా, అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా రద్దు చేయాలని ఆలోచించడం దురదృష్టకరమని అన్నారు. జిల్లా రద్దు యత్నాలకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి ఉద్యమిస్తామన్నారు.