గౌడ కులస్తుల ఘర్షణ, మీడియాపై దాడి

NZB: ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్‌లో సోమవారం రాత్రి చెట్ల వివాదం కారణంగా వీడీసీ గౌడ కులస్తుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకుని కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాల నాయకులు సీపీ సాయిచైతన్యకు వినతిపత్రం సమర్పించారు.