ఫర్టిలైజర్ యాప్‌పై రైతులకు అవగాహన
JGL: ఇబ్రహీంపట్నంలోని రైతు వేదికలో ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తున్న ఫర్టిలైజర్ యాప్ గురించి రైతులకు అవగాహన కల్పించారు. 20 నుంచి ఫర్టిలైజర్ యాప్ ద్వారా రైతుల దగ్గర్లో ఉన్న డీలర్ల వద్ద యూరియా స్టాక్ గురించి తెలుసుకోవచ్చని, రైతులు వారి మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి పంట వివరాలు నమోదు చేస్తే ఎంపిక చేసుకున్న డీలర్ వద్ద యూరియా బస్తాలు బుక్ చేసుకుని పొందవచ్చన్నారు.