రికార్డు సృష్టించిన 'పెద్ది' సాంగ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న 'పెద్ది' మూవీ నుంచి రిలీజైన 'చికిరి చికిరి' పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దక్షిణాదిలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా ఇది రికార్డు సృష్టించింది. గతంలో ఈ ఘనత 'పుష్ప 2' కిస్సిక్ పాట(27.19 మిలియన్ వ్యూస్) ఉండగా.. తాజాగా చికిరి పాట కేవలం 14 గంటల్లోనే 28.78 మిలియన్ వ్యూస్‌తో దాన్ని బద్దలు కొట్టింది.