తల్లిపాలతోనే శిశువు శారీరక ఎదుగుదల

ELR: చాట్రాయి మండలం ఆరుగొలను పేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలలో గురువారం తల్లిపాల వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీవో పిల్లి విజయకుమారి మాట్లాడుతూ.. తల్లిపాలతో పోషక విలువలు పెరిగి శిశువు మానసిక పరిపక్వత సాధించడం జరుగుతుందన్నారు. తల్లిపాలతోనే శిశువుకు శారీరక ఎదుగుదల ఏర్పడుతుందని తెలిపారు. తల్లిపాలు శిశువుకు రెండేళ్ల వరకు ఇవ్వాలన్నారు.