సమిత్వ సర్వే పరిశీలించిన MPDO

VZM: బొబ్బిలి MPDO రవికుమార్ మంగళవారం స్దానిక గోపాలరాయుడుపేటలో సమిత్వ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో సమిత్వ సర్వే సమర్థవంతంగా చేయాలని, ఇంటింటికి వెళ్లి సర్వే చేసి ఇళ్లు, ఖాళీ స్థలాలను గుర్తించాలని సూచించారు. సర్వేలో తప్పులు లేకుండా చూడాలని ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కావాలన్నారు.