'వైభవంగా ఎల్లారమ్మ జాతర వేడుకలు'

VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామంలో సిరుల ఎల్లమ్మ తల్లి జాతర సందర్భంగా సోమవారం వేకువ జాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేసి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అమ్మవారి జాతర సందర్భంగా రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.