కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తా: ఎమ్మెల్యే
AP: పొన్నూరుకు చెందిన వైసీపీ శ్రేణులు జనసేనలో చేరుతున్నారని MLA ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. జనసేన ముసుగులో పార్టీలో విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్లి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాజకీయ ముసుగులో ఉన్న బ్రోకర్లను కొంత వరకే సహిస్తానని తేల్చి చెప్పారు. ఇకనైనా పద్దతి మార్చుకోకపోతే సహించేది లేదని స్పష్టం చేశారు.