ఈనెల 24న మెగా జాబ్ మేళా
VZM: రాజాం పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 24న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ మేళాలో 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నట్లు ఆయన చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన యువత అర్హులుగా పేర్కొన్నారు.