ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు

VZM: వేపాడ మండలం బొద్దాంలో ఎరువుల దుకాణాల్లో ఆదివారం వ్యవసాయ శాఖ అధికారులు, విజిలెన్స్ బృందం సంయుక్తంగా తనిఖీలు చేశారు. బొద్దాం శ్రీదేవి ట్రేడర్స్ దుకాణాన్ని మండల వ్యవసాయ అధికారి ఎం.స్వాతి కుమారి, విజిలెన్స్ సీఐ బి.సింహాచలం, హెడ్ కానిస్టేబుల్స్ ఎ.కామేశ్వరరావు, పురుషోత్తంలతో కలిసి తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా దుకాణ రికార్డులను పరిశీలించారు.