'ముండ్లమూరులో పర్యటించిన జడ్పీ ఛైర్‌పర్సన్'

ప్రకాశం: ముండ్లమూరు మండలం నాయుడుపాలెం గ్రామంలో జడ్పీ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరై, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.