సిరిసిల్లకు జీవం పోసిన టెక్స్‌టైల్ పార్క్
SRCL: సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్ ప్రముఖ పారిశ్రామిక ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. సిరిసిల్ల హ్యాండ్‌లూమ్, పవర్‌లూమ్ పరిశ్రమలకు కేంద్రంగా పేరుగాంచింది. అయితే కాలక్రమేణా మార్కెట్ సమస్యలు, యాంత్రీకరణ లోపం వంటి కారణాలతో నేతన్నల పరిస్థితి దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఆధునిక సదుపాయాలతో టెక్స్‌టైల్ పార్క్‌ను అభివృద్ధి చేసింది.