మోడల్ స్కూల్‌లో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని KGBVలో మహిళా నైట్ వాచ్‌మెన్, తెలంగాణ మోడల్ స్కూల్‌లో హెడ్ కుక్ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MEO సుభాష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసక్తి గల మహిళలు ఈనెల 28లోగా జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో దరఖాస్తు చేసు కోవాలని సూచించారు. పదోతరగతి పాస్ అయి ఉండి, 45 ఏళ్లలోపు వయస్సు గలవారు అర్హులన్నారు.