ప్రజా వినతులు స్వీకరించిన MLA
KRNL: ఎమ్మిగనూరులో MLA బీవీ జయనాగేశ్వర రెడ్డి ఇవాళ నిర్వహించిన ప్రజాదర్బార్‌కు నందవరం మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు 120 అర్జీలు వచ్చాయి. MLA స్వయంగా వినతిపత్రాలు తీసుకొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా వినతులను సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను MLA ఆదేశించారు.