పుష్పగిరి ప్రదర్శనకు డీఎస్పీకి ఆహ్వానం

KDP: ఈనెల 7వ తేదీన పౌర్ణమి సందర్భంగా పుష్పగిరి మహాక్షేత్రంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి కడప డీఎస్పీ వెంకటేశ్వర్లును ఆలయ అధ్యక్షులు భార్గవి ఆహ్వానించారు. ఇందులో భాగంగా పౌర్ణమి గిరి ప్రదక్షణ కరపత్రాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కర్త మల్లికార్జున రెడ్డి, చేనేత కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు పాల్గొన్నారు.