తెరుచుకున్న దుగ్గిరాల రైల్వే గేటు

GNTR: గత నాలుగు రోజులుగా మరమ్మతుల కారణంగా మూసివేసిన దుగ్గిరాల రైల్వే గేటును పునఃప్రారంభించారు. రైల్వే గేటు మధ్యలో ఉన్న రోడ్డును మరమ్మతులు చేస్తుండగా, వాహనదారులు, చెన్నకేశవ నగర్, పెనుమూలి గ్రామాల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం లేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు రోడ్డు నిర్మాణం పూర్తవడంతో బుధవారం నుంచి మార్గం సుగమం అయింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.