'ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వం లక్ష్యం'
SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని ఆమదాలవలస మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గీతా విద్యాసాగర్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ప్రజలు నుంచి పలు సమస్యలపై దరఖాస్తులను అందుకున్నారు. ఈ సందర్భంగా వినతులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.