అండర్ 19 క్రికెట్ పోటీలకు జిల్లా విద్యార్థి ఎంపిక
NRML: రాష్ట్రస్థాయి అండర్ 19 క్రికెట్ పోటీలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి పవార్ శ్రీరామ్ ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ కనక మహాలక్ష్మి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంపీసీ మొదటి సంవత్సరంలో చదువుతున్న శ్రీరామ్ అండర్-19 క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.