VIDEO: చిత్తూరులో ఇద్దరు బైక్ దొంగల అరెస్ట్

చిత్తూరు DRDA వద్ద శుక్రవారం ఇద్దరు బైక్ దొంగలను అరెస్టు చేసినట్లు టూ టౌన్ సీఐ నెట్టి కంటయ్య తెలిపారు. వరుస బైక్ దొంగతనాల నేపథ్యంలో వాహనాల తనిఖీల్లో భాగంగా తోటపాల్యానికి చెందిన ఏసుదాస్ జయకుమార్, వేలూరు చెందిన లోకనాథంను అరెస్ట్ చేసి రూ.3.50 లక్షలు విలువచేసే 7 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముద్దాయిలను రిమాండు తరలించామన్నారు.