టెక్కలిలో అగ్ని ప్రమాదం తప్పిన ముప్పు

టెక్కలిలో అగ్ని ప్రమాదం తప్పిన ముప్పు

SKLM: టెక్కలి మండలం పరిధిలోని ఇందిరమ్మ జంక్షన్ సమీపంలో ఉన్న హీరో హోండా షోరూం వెనుక ఉన్న వర్క్ షాప్‌లో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలిని అదుపు చేశారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కొంతమేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.