దంతాలపల్లి మండలంలో విద్యుత్ సమస్యలు

దంతాలపల్లి: మండలంలో కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమయపాలన లేకుండా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ అవసరాలకై మండల వ్యాప్తంగా ఉన్న గ్రామస్తులు మండలానికి వస్తుంటారు. అధికారులు వెంటనే స్పందించి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు.