ఎంపీవోగా వల్లాల మహిళ
NLG: పట్టుదల ఉంటే విజయం వరిస్తుందని జాల రజిత నిరూపించారు. గ్రూప్-2 ఫలితాల్లో మెరిసి మండల పంచాయతీ అధికారిగా ఉద్యోగం సాధించిన ఆమెను శాలిగౌరారం మండలం వల్లాల గ్రామ ప్రజలు ఈరోజు సన్మానించారు. జాల బిక్షం-భద్రమ్మ దంపతుల కుమార్తె అయిన రజితకు, ఆమె భర్త సైదులుకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.