మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నాయకులు

NLG: దేశ ప్రధాని నరేంద్ర మోడీ 122వ మన్ కీ బాత్ లైవ్ కార్యక్రమాన్ని నల్గొండ పట్టణంలోని 25వ వార్డు 65వ బూత్‌లో బీజేపీ నాయకులు ఆదివారం వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతే పాక లింగస్వామి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రావెళ్ళ కాశమ్మ, పట్టణ అధ్యక్షుడు గడ్డం మహేష్ తదితరులు ఉన్నారు.