రూపాయి ఖర్చు.. ఒక్క క్షణం వృధా చేయవద్దు: మంత్రి

W.G: మంత్రి నిమ్మల రామానాయుడు తన పుట్టినరోజును పురస్కరించుకొని ఒక్క రూపాయి ఖర్చు.. ఒక్క క్షణం వృధా చేయవద్దని తెలిపారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా కూటమి శ్రేణులతోపాటు అధికారులు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలకు ఈ సందేశాన్ని ఇచ్చారు. తన వద్దకు బొకేలు, కేకులు, స్వీట్లు, దండలు, పండ్లు వంటివి తీసుకురావద్దని, శుభాకాంక్షల ప్రకటనలు ఇవ్వవద్దన్నారు.