నల్లలమ్మ జాతరలో ఎమ్మెల్యే బండారు శ్రావణి

నల్లలమ్మ జాతరలో ఎమ్మెల్యే బండారు శ్రావణి

ATP: శింగనమల మండలం కళ్లుమడి గ్రామంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే నల్లలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం జరిగింది. ఈ జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆమె కోరారు. జాతరకు వచ్చిన భక్తులతో మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.