'డీఎస్సీ నియామకాలలో పారదర్శకత పాటించాలి'

'డీఎస్సీ నియామకాలలో పారదర్శకత పాటించాలి'

KRNL: డీఎస్సీ నియామకాలలో పారదర్శకత పాటించాలని AISF జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.ఈరేష్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన కోసిగిలో మట్లడుతూ.. DSC అభ్యర్థులను గందరగోళం చేసే విధంగా విద్యాశాఖ అధికారుల తీరు ఉందని తెలిపారు. ముందు జిల్లాల వారీగా మొత్తం DSC అభ్యర్థుల మెరిట్ లిస్ట్, వారి ర్యాంక్‌లను విడుదల చేయకుండా.. మెరిట్ లిస్ట్ మాత్రమే విడుదల చేయడం బాధాకరమన్నారు.