భారత్ మాకు ముఖ్యమైన భాగస్వామి: ట్రంప్
రష్యా చమురు కొనుగోలుపై భారత్‌కు 30 రోజుల మినహాయింపు ఇవ్వడంపై ట్రంప్ స్పందించారు. భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామి అని పేర్కొన్నారు. యుద్ధం వల్ల గల్ఫ్‌లో చమురు సరఫరా మార్గాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. ప్రపంచ దేశాల్లోని ఇంధన మార్కెట్లపై ఒత్తిడి తగ్గించేందుకే భారత్‌కు అనుమతి ఇచ్చామన్నారు. భారత్ కొనుగోలుతో రష్యాకు ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం చేకూరదని తెలిపారు.